విండోస్ Xp స్టార్టప్ లో వచ్చే ఫైల్ మిస్సింగ్ సమస్యలను సాల్వ్ చేయడం ఎలా?

విండోస్ xp స్టార్టప్ లో వచ్చే ఫైల్ మిస్సింగ్ సమస్యలను సాల్వ్ చేయడం ఎలా?
తరచుగా వచ్చే ఫైల్ మిస్సింగ్ సమస్యలు:


1. Windows could not start because the following file is missing or corrupt:
\system32\config\system
-------------------------------------------------------------------------------------------------
2. Windows could not start because the following file is missing or corrupt:
\system32\ntoskrnl.exe
Please re-install a copy of the above file.
-------------------------------------------------------------------------------------------------
3. Windows could not start because the following file is missing or corrupt:
\system32\HAL.dll
--------------------------------------------------------------------------------------------------
4. NTLDR is Missing
Press any key to restart
---------------------------------


పై 4 ప్రాబ్లమ్స్ లో మీ కంప్యూటర్లో ఏ ప్రాబ్లం వచ్చినా విండోస్ రికవరీ కన్సోల్ ద్వారా క్రింది కమాండ్స్ ను ఉపయోగించి సులభంగా xp ని రికవర్ చేయవచ్చు.

విండోస్ రికవరీ కోసం ఉపయోగించే కమాండ్స్:

1. cd ..
2. attrib -h c:\boot.ini
3. attrib -s c:\boot.ini
4. attrib -r c:\boot.ini
5. del boot.ini
6. bootcfg /rebuild
7. chkdsk /r /f
8. fixbootపై కమాండ్స్ లో bootcfg /rebuild అనే కమాండ్ కంప్లీట్ డయాగ్నస్టిక్ టూల్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కమాండ్ ద్వారా విండోస్ స్టార్టప్ లో మనల్ని విసిగించే మిస్/కరప్టడ్ సిస్టమ్ ఫైల్స్ ను రిమూవ్/రిప్లేస్/రిపేర్ చేయవచ్చు.

విండోస్ రికవరీ కన్సోల్ ద్వారా మిస్డ్ మరియు కరప్టడ్ సిస్టం ఫైల్స్ ను రికవర్ చేయడం స్టెప్ వైజ్ గా:


1. సీడీ డ్రైవ్లో విండోస్ xp (బూటబుల్) సీడీని ఇన్ సెర్ట్ చేసి, బయాస్ లో 1st bootable device గా cd-rom ను సెట్ చేసి సేవ్ చేసి రీస్టార్ట్ చేయండి.


2. సీడీ నుండి బూట్ అయి స్క్రీన్ మీద ఈ క్రింది విధంగా మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. తర్వాత 2వ ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి కీబోర్డ్ లో R ను ప్రెస్ చేయండి.
3.ఈ క్రింది స్క్రీన్ ను ఫాలో అవుతూ మొదట 1 ని నొక్కండి. తర్వాత మీ కంప్యూటర్ పాస్ వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ లేకపోతే డైరెక్ట్ గా ఎంటర్ ను ప్రెస్ చేయండి.
4.c:\windows నుండి c:\ డ్రైవ్ లోకి రావడానికి cd .. కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి

5.ఈ క్రింది స్క్రీన్ లో వలె C:>ATTRIB -H C:BOOT.INI AND ENTER C:>ATTRIB -R C:BOOT.INI AND ENTER C:>ATTRIB -S C:BOOT.INI AND ENTER కమాండ్స్ ఉపయోగించండి.


6. ఇపుడు మనము BOOT.INI ఫైల్ యొక్క సులభంగా ఎడిట్ చేయవచ్చు. ఈ క్రింది స్క్రీన్ లో వలె c:\>del boot.ini కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి


7.ఈ క్రింది స్క్రీన్ లో వలె bootcfg /rebuild కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి తర్వాత y and enter తర్వాత windows xp professional edition తర్వాత /fastdetect /noexecute=option లను వరుసగా ఎంటర్ చేయండి.


8.ఫైనల్ గా CHKDSK /R ను C:\>వద్ద టైప్ చేసి ఎంటర్ చేయండి. చెక్ డిస్క్ ప్రాసెస్ దాదాపు 30 నిముషాల దాకా అవుతుంది అంతవరకు వైయిట్ చేసి EXIT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇపుడు సిస్టమ్ రీస్టార్ట్ అయి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ ఓపెన్ అవుతుంది.

Comments :

2 comments to “విండోస్ Xp స్టార్టప్ లో వచ్చే ఫైల్ మిస్సింగ్ సమస్యలను సాల్వ్ చేయడం ఎలా?”
mesnehitudu said...
on 

sir me suchanalu andariki entagano upayogapadutunnay. kani blogs matter systemlo ela save chesukovacho cheppagalaru.

మహిగ్రాఫిక్స్ said...
on 

మీరు సిస్టం లో సేవ్ చేయాలంటే snagit లాంటి screen capture software ఉపయోగించితే లింక్ ల తో సహా సేవ్ చేస్కోగలరు. దీని గురించి త్వరలోనే మరింత వివరంగా ఒక పోస్ట్ పెడతాను

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments