3డీ మ్యాక్స్ లో జెండాను ఎలా తయారుచేయాలో...

3డీ మ్యాక్స్ లో జెండాను ఎలా తయారుచేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. ఖడ్గం సినిమాలో "మేమే ఇండియన్స్" పాటలో కూడా జెండాను ఇలాగే మాయాలో తయారు చేశారు. 3డి మ్యాక్స్ నేర్చుకుంటే మాయా చేయడం చాలా ఈజీ. ఓపికతో ఇలాంటి ట్యుటోరియల్స్ ను చదివి చేయగలిగితే మీరు కూడా సినిమాలకు గ్రాఫిక్ వర్క్ చేయగలరు. క్రింద మోడల్ కోసం 2 జెండాలు తయారు చేసి స్ట్రీమింగ్ ఫ్లాష్ ఫైల్స్ పెట్టాను. అవి లోడ్ అవడానికి మీ ఇంటర్ నెట్ స్పీడ్ ను బట్టి ఒక నిముషం దాకా పట్టవచ్చు. అంత వరకూ ఓపికతో వెయిట్ చేయండి.
1.Create - Geometry - Plane ను క్లిక్ చేసి ఫ్రంట్ వ్యూలో డ్రాగ్ చేసి ఒక ప్లేన్ ను గీయండి.


2. Modify panel లోకి వెళ్లి Plane యొక్క parameters ఈ క్రింది విధంగా సెట్ చేయండి.


3. Create - Geometry - cylinder ను క్లిక్ చేసి Top View port లో ప్లేన్ ప్రక్కనే గీయండి. చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటే చాలు.


4. Create - Space Warps - Wind ను క్లిక్ చేసి Right View port లో Plane కు మధ్యలో క్లిక్ చేయండి. ఈ క్రింది విధంగా


5. Plane ను సెలెక్టు చేసి Modify - Modifier list లో Meshselectను క్లిక్ చేయండి


6. ఈ క్రింది విధంగా Meshselect Modifier లో Vertex ను క్లిక్ చేయండి.


7. ఇపుడు ఫ్రంట్ వ్యూలో ఈ క్రింది విధంగా Plane యొక్క లెఫ్ట్ వర్టెక్స్ రోను మాత్రం వదిలివేసి మిగిలిన అన్నీ వెర్టెక్స్ ను సెలెక్ట్ చేయండి....తర్వాత Modifier list లో Flex ను క్లిక్ చేయండి


8. Modifier List క్రింద Flex ను క్లిక్ చేసి Forces and Deflectors లో Add బటన్ ను క్లిక్ చేసి ఏదో ఒక వ్యూలో మనం ఇంతకు ముందు క్రియేట్ చేసిన Wind అబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. క్రింది విధంగా:


9. Wind అబ్జెక్ట్ Add అయిన తర్వాత Forces and Deflectors లో మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది


10. Plane యొక్క Modifiers లో Flex sub modifiers లో Weights and Springs ను క్లిక్ చేయండి


11.Weights and Springs యొక్క ప్రాపర్టీస్ లో Advanced springs లో Show springs కు టిక్ పెట్టండి


12. ఇపుడు Edit menu లో Hold ను క్లిక్ చేయండి


13. Weights and springs modifier లో Simple soft bodies లో క్రింది విధంగా పారామీటర్స్ సెట్ చేసి Create simple soft body మీద క్లిక్ చేయండి


14. తర్వాత Advanced Springs లో Show springs కు టిక్ తీసివేయండి


15. ఇపుడు క్రింద చూపిన విధంగా డైరెక్ట్ గా Modifiers లో Flex ను క్లిక్ చేసి parameters లో use change springs కు కూడా టిక్ తీసివేయండి


16. Simple soft body properties లో ఈ క్రింది విధంగా సెట్ చేయండి


17. Wind అబ్జెక్ట్ మీద క్లిక్ చేసి parameters లో ఈ క్రింది విధంగా సెట్ చేయండి


18. తర్వాత క్రింద ఉన్న Autokey బటన్ ను ప్రెస్ చేసి, టైం కంట్రోల్ ను 30వ ఫ్రేం వద్దకు లాగి, Rotate tool నుపయోగించి wind యొక్క Z axis ను 35 డిగ్రీస్ కు రొటేట్ చేయండి. మళ్లీ టైం కంట్రోల్ ను 100 వ ఫ్రేం వద్దకు లాగి, Rotate tool నుపయోగించి wind యొక్క Z axis ను -35 డిగ్రీస్ కు రొటేట్ చేయండి. క్రింది విధంగా:

అంతే...ఇక ప్లే బటన్ కొట్టండి.. జెండా ఎగరడం మొదలు పెడుతుంది.

Comments :

1
Anonymous said...
on 

mahi garu,chala baunnayandi.okati rendu tutorials kakundaa meeru veelainanni tutorials ni add cheyyandi. mee blog ki traffic baaga peruguthundi.any how mee zeal ki naa abhinandanalu.keep it up.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments