మీ కంప్యూటర్ డ్రైవర్లను బ్యాకప్ చేయడానికి, ఆటోమేటిక్ అప్ డేట్ చేయడానికి ఫ్రీ వేర్

కంప్యూటర్లో విండోస్ ఇన్స్టాల్ చేసిన ప్రతి సారి మదర్ బోర్డ్ డ్రైవర్ సీడీ పెట్టి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సిందేనా?
తర్వాత మోడెమ్ డ్రైవర్స్, సెపరేట్ గా సౌండ్ కార్డ్ వుంటే దాని డ్రైవర్స్, ఏజీపి డ్రైవర్స్...
ఇలా ఎన్ని డ్రైవర్ సీడీస్ ప్రతీ సారి ఇన్స్టాల్ చేస్తారు...దీనికి వేరే మార్గమే లేదా?....
ఉంది అది కూడా ఉచితంగా...ఒక్క సారి మాత్రమే అలా అన్నీ డ్రైవర్ సీడీస్ ఇన్స్టాల్ చేయండి.
ఇక తర్వాత నుంచి ఒకే ఒక్క సాఫ్ట్వేర్ Driver Max ఉంటే చాలు...ఇది కంప్లేట్ ఫ్రీ వేర్..
జస్ట్ మీ మెయిల్ ఐడీ తో ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే అడుగుతుంది.

ఇందులో ని ఫీచర్స్...

* మీ కంప్యూటర్లో ని డ్రైవర్స్ ను వెతికి అన్నింటినీ కలిపి ఒకే ఫైల్ గా బ్యాకప్ చేస్తుంది.
* ఒక వేళ మీ కంప్యూటర్లో ఏ డివైజ్ కైనా డ్రైవర్ ఫైల్స్ లేకపోతే అదే ఇంటర్నెట్ లో వెతికి మరీ ఇన్స్టాల్ చేస్తుంది.

* మీ పాత డ్రైవర్స్ కు అప్ డేట్స్ ను వెతికి ఇన్స్టాల్ చేస్తుంది.
* మీ కంప్యూటర్లో ఏమేమి డ్రైవర్స్ ఉన్నాయో వాటి వివరాలు పూర్తి గా లిస్ట్ వ్రాసి ఇస్తుంది.
* విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.


1. ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా Claim your free registration code మీద క్లిక్ చేయండి.2. ఈ క్రింది విధంగా మీ వివరాలను ఎంటర్ చేయండి..3. తరవాతి డైలాగ్ బాక్స్ లో మీ మెయిల్ ఐడీ అడుగుతుంది. ఎంటర్ చేయండి. వెంటనే మీకు రిజిస్ట్రేషన్ కోడ్ మెయిల్ చేయబడుతుంది.

4. మీ మెయిల్ కు పంపబడిన రిజిస్ట్రేషన్ కోడ్ ను ఇక్కడ పేస్ట్ చేయండి.అంతే ఇక మీకు Driver max Open అవుతుంది.Comments :

2 comments to “మీ కంప్యూటర్ డ్రైవర్లను బ్యాకప్ చేయడానికి, ఆటోమేటిక్ అప్ డేట్ చేయడానికి ఫ్రీ వేర్”
kamalhasan said...
on 

good posting...

mesnehitudu said...
on 

sir motham bhagane undi kani indilo software download koda iste inka bagundedi sir

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments