ఫోటోషాప్ లో Layers అంటే ఏమిటి?

కంప్యూటర్లు లేక ముందు కూడా ఫోటో లను మిక్సింగ్ చేసేవారు. అపుడు అంతా మాన్యువల్ గా చేసేవాళ్లు.
ఉదా:కు మనం స్టూడియోలో ఒక ఫోటో దిగామనకోండి. అంటే ఫోటోలో మీ వెనకాల స్టూడియోలో ఉపయోగించిన బ్యాక్ గ్రౌండ్ కర్టెన్స్ ఉండేవి. అయితే అదే ఫోటో లో బ్యాక్ గ్రౌండ్ గా కర్టెన్స్ కాకుండా..ఏ నయాగరా ఫాల్సో ఉండాలనుకుంటే...అప్పట్లో ఒక నయాగరా ఫాల్స్ ఫోటో ను తెచ్చి, మీరు దిగిన ఫోటో లో మీ చూట్టూ కత్తెర తో కట్ చేసి బ్యాక్ గ్రౌండ్ కర్టెన్స్ తీసి వేసి, కట్ చేసిన మీ ఫోటోను మాత్రం నయాగారా ఫాల్స్ ఫోటోలో ఒడ్డున గమ్ పెట్టి అతికించే వాళ్లు.అంటే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ గా ఉపయోగించింది నయాగారా ఫాల్స్..సో దాన్ని బ్యాక్ గ్రౌండ్ లేయర్ అంటారు.
దాని పైన పెట్టిన మీ ఫోటోను లేయర్ 1 అని పిలుస్తారు. అలా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మీద అలా ఎన్ని పొర(లేయర్స్) లైనా యాడ్ చేసి మిక్సింగ్ చేయవచ్చు.అపుడు లేయర్ ను కత్తెరతో కట్ చేసేవాళ్లు..
ఇపుడు మనం ఫోటో షాప్ లో ఎంత వరకు కట్ చేయాలనుకుంటున్నామో అంత వరకు లాసో టూల్స్, పెన్ టూల్స్, నుపయోగించి ముందుగా సెలెక్ట్ చేసి వద్దనుకున్న భాగాన్ని డెలెట్ చేస్తున్నాము. అంతే తేడా. అన్నిటికంటే అడుగున ఉన్న లేయర్ ను బ్యాక్ గ్రౌండ్ లేయర్ అని అంటాము..తరవాత దాని పైన ఉన్నవి లేయర్ 1, లేయర్ 2 అలా పిలుస్తాము. సాధారణంగా బ్యాక్ గ్రౌండ్ లేయర్ ఎపుడూ లాక్ చేయబడి ఉంటుంది. ఏ లేయర్ అయితే లాక్ చేయబడి ఉందో దానిని మనము అటూ, ఇటూ జరుపుకోలేము.అలాంటపుడు లాక్ ను తీసివేయాలంటే ఆ లాక్ సింబల్ మీద డబుల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే లాక్ రిలీజ్ అవుతుంది. అంతే ఇక మీరు బ్యాక్ గ్రౌండ్ లేయర్ ను కూడా ఇష్టం వచ్చినట్లు జరుపుకోవచ్చు.అలాగే మిగిలిన లేయర్స్ ప్రక్కకి జరగకుండా లేయర్స్ ను లాక్ కూడా చేయవచ్చు. లేయర్స్ ప్యానల్ లో పై భాగాన Lock అని కనిపిస్తూ ఉంటుంది. అందులో నాలుగు రకాల లాక్స్ ఉంటాయి. వాటిలో చివరి దానితో లేయర్ మొత్తం లాక్ చేయవచ్చు..మిగిలిన Locks గురించి తర్వాత పోస్టులో తెలియచేస్తాను.ఇక ఫోటోషాప్ లో మీరు వర్క్ చేసేటపుడు ఏదైనా లేయర్ అడ్డం వచ్చి, వెనుక వున్న లేయర్ కనపడకుండా ఉంటే అడ్డు వచ్చిన లేయర్ ను హైడ్ కూడా చేయవచ్చు.ఏ లేయర్ నైతే హైడ్ చేయాలనుకుంటున్నారో లేయర్స్ ప్యానెల్ లో ఆ లేయర్ ప్రక్కనే ఉన్న కన్ను సింబల్ ను క్లిక్ చేస్తే చాలు. ఆ లేయర్ హైడ్ అయిపోతుంది. మళ్లీ దానిమీదే క్లిక్ చేస్తే లేయర్ విజిబుల్ అవుతుంది. క్రింద చూపిన లేయర్స్ స్ట్రక్చర్ ను గమనించండి మీకు లేయర్స్ గురించి సులభంగా అర్థం అవుతుంది.

Comments :

4 comments to “ఫోటోషాప్ లో Layers అంటే ఏమిటి?”
Anonymous said...
on 

please post more about photoshop ..

...Padmarpita... said...
on 

ఇప్పుడే చూస్తున్నాను మీ బ్లాగ్....నాలాంటి వారికి మంచి ఉపయోగకరంగా వుందండి. మరిన్ని వివరాలని ఆశిస్తూ....

చిలమకూరు విజయమోహన్ said...
on 

ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటున్న నాలాంటి వారికి చాలా ఉపయుక్తంగా ఉంది.ధన్యవాదములు.

venkataramaiah said...
on 

this is very well

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments