అతి తక్కువ సైజ్ లో ఫాస్ట్ స్క్రీన్ క్యాప్చర్ ఫ్రీవేర్

స్క్రీన్ క్యాప్చర్ చేయడానికి బెస్ట్ ఫ్రీవేర్ Snippy. సింపుల్ స్టెప్స్ తో ఎవరైనా సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. ఉదా:కు మీరు బ్రౌజింగ్ చేసేటపుడు ఏదైనా వెబ్ సైట్ లో మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కనిపించిందనుకోండి. వెంటనే దాని చుట్టూ ఒక గీత గీస్తే చాలు. మీకు అది ఇమేజిగా మీ కంప్యూటర్లో సేవ్ అవుతుంది.


1. పై డౌన్లోడ్ లింక్ నుండి Snippy ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేయండి. వెంటనే మీ కంప్యూటర్లో టాస్క్ బార్లో క్రింది విధంగా కత్తెర సింబల్ ఐకాన్ వస్తుంది.2. మీరు స్క్రీన్ మీది మ్యాటర్ ను క్యాప్చర్ చేయాలనుకున్నాపుడు కత్తెర సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత పెన్సిల్ సంబల్ వస్తుంది.


3. ఇపుడు పెన్సిల్ సింబల్ తో క్యాప్చర్ చేయాలనుకున్న మ్యాటర్ చుట్టూ గీయండి. ఒక వేళ మీకు చతురస్రాకారంలో డైరెక్ట్ గా గీయాలంటే Shift ను నొక్కిపట్టి గీయండి.


4. తర్వాత టాస్క్ బార్ లో కత్తెర సింబల్ మీద రైట్ క్లిక్ చేసి Save as ద్వారా మీ కంప్యూటర్లో క్యాప్చర్డ్ మ్యాటర్ ను ఇమేజ్ గా సేవ్ చేయండి.Comments :

4 comments to “అతి తక్కువ సైజ్ లో ఫాస్ట్ స్క్రీన్ క్యాప్చర్ ఫ్రీవేర్”
నాగప్రసాద్ said...
on 

ఫోటోషాప్ లో తెలుగు ఎలా టైపు చెయ్యాలో దయచేసి వివరించగలరు.
నేను ప్రయత్నించాను కాని ఒత్తులు విడిపోయి వస్తున్నాయి. మీ బ్లాగులో పైన "సిస్ వరల్డ్" అన్నది ఫోటోషాప్ లో తయారుచేశారా లేక వేరే ఏదన్నా software వాడారా?

mahigrafix said...
on 

నాగప్రసాద్ గారు,
పైన నేను వాడింది అనూ ఫాంట్స్. అనూఫాంట్స్ ను ఇన్స్టాల్ చేస్కొని ఫోటోషాప్ లో డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయవచ్చు. అంతే కాదు అనూ ఫాంట్స్ లో రకరకాల మోడల్ ఫాంట్స్ లభిస్తాయి. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు అనూఫాంట్స్ కొనుగోలు చేయవచ్చు.
http://www.anufonts.com/telugu.html

Ananth said...
on 

welcome to mahi blogs anedi ela create chesaru...cheptharaaa

mahigrafix said...
on 

అనంత్ గారు,
మీరు అడిగిన lcd announcement ను బ్లాగులో ఎలా పెట్టుకోవాలో ఈ http://superblogtutorials.blogspot.com/2009/03/lcd-announcements.html లింకులో చూడగలరు. థాంక్యూ

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments