మీ సెల్ ఫోన్ ను ఎవరైనా దొంగతనం చేస్తే?

ఇలాంటి సంఘటన జరిగినపుడు దిగులుపడకండి. కూల్ గా మీ ఫోన్ ను దొంగతనం చేసిన దొంగకు ఫోన్ చేసి, మీ ఫోన్ ను మర్యాదగా తెచ్చివ్వమని కాల్ చేయండి. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. అయితే మీరు ఈ క్రింది సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కొని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేస్కొని ఉండాలి. ఇదంతా ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. దొంగతనం చేసిన తర్వాత దొంగ ఏం చేస్తాడు? మహా అయితే మీ సిమ్ తీసేసి, వేరే సిమ్ వేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే దొంగ దొరికిపోతాడు. సిమ్ మార్చిన వెంటనే, ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ సిమ్ నంబర్ ద్వారా మార్చబడిన సిమ్ కు sms పంపిస్తుంది. తర్వాత ఆ మొబైల్ లో సైరన్ మోగుతుంది. ఇంకా స్క్రీన్ బ్లాక్ కలర్ లో బ్లాంక్ స్క్రీన్ గా మారిపోతుంది. ఆ తర్వాత ఆ మార్చబడిన సిమ్ నుండి మీకు మెసేజి పంపబడుతుంది. వెంటనే మీరు డౌరెక్ట్ గా ఆ నంబర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా పోలీస్ సహాయంతో ఆ దొంగను పట్టుకోవచ్చు. ఇదంతా చేయడానికి మీరు ఈ సాఫ్ట్వేర్ ను మెమొరీ కార్డ్ లో కాకుండా, ఫోన్ మెమరీలో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు ఒక సీరియల్ నం. చూపబడుతుంది. ఆ నం. నోట్ చేస్కోండి. ఇస్స్టాల్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ అడుగుతుంది. అపుడు నాలుగు '0' లను ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఈ పాస్వర్డ్ ను మార్చుకోవచ్చు. తర్వాత మీ పేరును మరియు మీ ఇంకొక మొబైల్ నం. ను ఎంటర్ చేయండి. మొబైల్ దొంగతనం జరిగిన తర్వాత మీరు అదనంగా ఇచ్చిన మొబైలన్ నం.కు sms పంపబడుతుంది. గమనిక: ఈ సాఫ్ట్వేర్ కేవలం nokia s60 series ఫోన్స్ 6600,N70,N72,N73 లాంటి వాటికి మాత్రమే పని చేస్తుంది.

DOWNLOADComments :

2 comments to “మీ సెల్ ఫోన్ ను ఎవరైనా దొంగతనం చేస్తే?”
పరిమళం said...
on 

మహేష్ గారికి , అందరికీ ఉపయోగకరమైన పోస్ట్ లు రాస్తున్నందుకు ధన్య వాదాలు . నేను వేరే బ్లాగ్ లో కామెంట్ చేసినపుడు పక్కనే డిలీట్ బాక్స్ వస్తుంది .అది రాకుండా ఉండాలంటే ఎలా ? తెలియచేయగలరు .

sree said...
on 

నేను n70 నే వాడుతున్నాను చాలా ఉపయోగకరమైన విషయాన్ని మీ ద్వారా తెలుసుకోగలిగాను ధన్యవాదాలండి మహేష్ గారు

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments