అనేక సమయాలలో వైరస్ కాని, ట్రోజాన్స్ కాని, స్పైవేర్ కాని మన కంప్యూటర్లోకి ప్రవేశించి టాస్క్ మేనేజర్ డిజేబుల్ అవడం మనం గమనిస్తూనే ఉంటాము. మాల్ వేర్ రన్ అయేటపుడు ఆ ప్రాసెస్ ను పీసీ యూజర్ ఆపకుండా ఉండేందుకు మాల్ వేర్ క్రియేటర్స్ మొదట టాస్క్ బార్ ను డిజేబుల్ చేయడానికి ఈ విధమైన టెక్నిక్స్ ఉపయోగిస్తుంటారు.
టాస్క్ బార్ ను ఓపెన్ చేయడానికి మనము సహజంగా నాలుగు పద్ధతులనుపయోగిస్తుంటాము
1.Ctrl + Alt + Delete
2.Ctrl + Shift + Esc
3.టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి Task Manager క్లిక్ చేయడం ద్వారా
4.Start >> Run >> type "TASKMGR"
కానీ ఇలా టాస్క్ బార్ డిజేబుల్ చేయబడినపుడు ఈ నాలుగు కమాండ్స్ లో ఏ ఒక్క కమాండ్ ద్వారా కూడా టాస్క్ బార్ ను ఓపెన్ చేయలేము.ఈ క్రింద చూపిన విధంగా ఎర్రర్ కూడా వస్తుంది.
అయితే టాస్క్ బార్ డిజేబుల్ అయినపుడు, తిరిగి టాస్క్ బార్ ను ఎనేబుల్ చేయడానికి కొన్ని మెథడ్స్ ను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను.
మెథడ్ A:(గ్రూప్ పాలసీ ఎడిటర్ ద్వారా)
1. Start >> Run >> లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. User Configuration >> Administrative Templates >> System >> Ctrl+Alt+Del Options ను క్లిక్ చేయండి.
3. Remove Task Manager మీద డబుల్ క్లిక్ చేయండి.
4. "Not Configured" ను సెలెక్ట్ చేసి ok క్లిక్ చేసి గ్రూప్ పాలసీని క్లోజ్ చేయండి.
మెథడ్ B:(ఒక లైన్ రన్ చేయడం ద్వారా)
1. Start >> Run ను క్లిక్ చేసి క్రింది కమాండ్ ను ఎక్జాక్ట్ గా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
REG add HKCU\Software\Microsoft\Windows\CurrentVersion\Policies\System /v DisableTaskMgr /t REG_DWORD /d 0 /f
మెథడ్ C:(ఒక రిజిస్ట్రీ ఫైల్ క్రియేట్ చేయడం ద్వారా)
1. నోట్ పాడ్ ను ఓపెన్ చేసి క్రింది కోడ్ ను కాపీ చేస్కొని డెస్క్ టాప్ పై taskmanager.reg అనే పేరుతో సేవ్ చేయండి.
Windows Registry Editor Version 5.00
[HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Policies\System]
“DisableTaskMgr”=dword:00000000
2. డెస్క్ టాప్ పై సేవ్ చేసిన taskmanager.reg ను డబుల్ క్లిక్ చేసి రన్ చేయండి.
మెథడ్ D:(ఒక రిజిస్ట్రీ ఎడిటింగ్ ద్వారా)
1. Start >> Run >> లో REGEDIT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. HKEY_CURRENT_USER \ Software \ Microsoft \ Windows \ CurrentVersion \ Policies\ System లో కుడి ప్రక్కన ఉన్న ప్యానెల్ లో DisableTaskMgr అనే వాల్యూ ను డెలెట్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ను క్లోజ్ చేయండి.
మెథడ్ E:(సాఫ్ట్వేర్ రన్ చేయడం ద్వారా)
1. ఇక్కడ క్లిక్ చేసి Task Manager Fix ప్రోగ్రామ్ ను డౌన్లోడ్ చేస్కొని రన్ చేయండి.
Enable "Disabled Task bar" with Simple Tricks
Labels:
సెక్యూరిటీ
Subscribe to:
Post Comments (Atom)











Comments :
Post a Comment