
ఫోటోషాప్ లో పై విధమైన మెటల్ టెక్స్ట్ ను ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం
క్రింద ఇవ్వబడిన అన్నీ స్టెప్స్ ను గమనించి మీరు కూడా సింపుల్ గా మెటల్ టెక్స్ట్ క్రియేట్ చేయండి.
(గమనిక: మీరు ఈ ట్యుటోరియల్ ను ప్రాక్టీస్ చేసేటపుడు స్క్రీన్ షాట్స్ లో ఎల్లో కలర్ తో హైలెట్ అయినవి అన్నీ మీరు చేసేటపుడు కూడా కరెక్ట్ గా ఉన్నయో లేదో చూస్కొని ఈ స్టెప్స్ ఫాలో అవండి)
1. ఫోటోషాప్ లో File >> New ను క్లిక్ చేసి (కీబోర్డ్ ద్వారా అయితే Ctrl+N) ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓకే బటన్ ను ప్రెస్ చేయండి.
2. ఇపుడు ఏర్పడిన ఖాళీ కాన్వాస్ మీద టైప్ టూల్
నుపయోగించి మీరు కోరుకున్న టెక్స్ట్ ను టైప్ చేయండి.
3. Layers ప్యానెల్ లో మీరు టైప్ చేసిన లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.
4. Layer Style Properties విండోలో వరుసగా ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి.
Drop Shadow
Gradient Overlay
First Color = 8B742D, Second Color = FEEEB0
Bevel and Emboss
Highlight mode: D4B969
Shadow mode: FFD972
Stroke
Stoke Color: 756930
5. మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఇపుడు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
6. ఇపుడు Layers panel లో టైప్ లేయర్ క్రింద ఉన్న బ్యాక్ గ్రౌండ్ లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి ఓకే బటన్ ను క్లిక్ చేయండి.

7. Layers panel లో బ్యాక్ గ్రౌండ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.
8. Layer Style Properties విండోలో వరుసగా ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి.
Color Overlay
Color: 946a0f
Pattern Overlay
ఇక మీరు తయారు చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్ ను గమనించండి. ఈ పోస్టులో పైన పెట్టిన హెడర్ ఇమేజిలాగా మారుతుంది. సందేహాలేమైనా ఉంటే కింద రిప్లై ఇవ్వండి. మీరు కూడా మహిగ్రాఫిక్స్ టీమ్ లో చేరాలనుకుంటే http://mahigrafix.com/forums ను క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్టర్ చేస్కొని మహీగ్రాఫిక్స్ టీమ్ లో చేరండి.
Photoshop Tutorial - Metal Text Creation
Labels:
ఫోటోషాప్ ట్యుటోరియల్స్
Subscribe to:
Post Comments (Atom)











Comments :
Post a Comment